శాంతి భద్రతల పరిరక్షణే పోలీస్ లక్ష్యం : సిరిసిల్ల డీఎస్పీ

శాంతి భద్రతల పరిరక్షణయే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని

Update: 2024-11-07 14:56 GMT

దిశ,తంగళ్ళపల్లి : శాంతి భద్రతల పరిరక్షణయే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసీఆర్ నగర్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్స్ లేని 76 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతా భావం, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం, ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉండేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ, గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా.. అనే విషయం కూడా తెలుస్తుందన్నారు.

గ్రామాల్లో ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు ,లేదా డయల్ 100 కాల్ కు చేసి సమాచారం అందించాలన్నారు. అలాగే మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలలచే విస్తృత తనిఖీలు నిర్వహించారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో గంజాయి, గుడుంబా తయారీకి సంబంధించిన సమాచారం ఉంటే పోలీస్ వారికి అందించాలని తెలిపారు. గ్రామాల్లో మరింత స్వీయ రక్షణకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల్లో, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. సంబంధించిన వాహన దారులకు సరైన పత్రాలు చూపించి వాహనాలు తీసుక వెళ్లవచ్చని డీఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐ మొగిలి, ఎస్ఐ రామ్మోహన్, శ్రీకాంత్,గణేష్, ఆర్ఎస్ఐ దిలీప్, పోలీస్ సిబ్బంది, డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.


Similar News