మా భూములు మాకు ఇప్పించండి
మా భూములను మాకు ఇప్పించండి అంటూ ప్రజావాణిలో తాండ్రియాల గ్రామస్తులు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
దిశ, కథలాపూర్ : మా భూములను మాకు ఇప్పించండి అంటూ ప్రజావాణిలో తాండ్రియాల గ్రామస్తులు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన సుమారు 10 మంది రైతులు తమకు తాతముత్తాతల నుండి వంశపారంపర్యంగా సంక్రమించిన 489, 492 సర్వే నెంబర్ లో గల సుమారు 8 ఎకరాల భూమిలోకి ఇప్పపెల్లి తండాకు చెందిన ఓ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ భూముల్లో పట్టా ఉందని భూమిని చదును చేసుకున్నాడు. ఇదేంటంటూ ప్రశ్నించిన మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తూ మీకు నచ్చిన చోట చెప్పుకోండని బయపెడుతున్నారని బాధితులు వాపోయారు. దీనిపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.