గంగుల కమలాకర్ నీ ఆస్తిపాస్తులను ప్రజలకు రాసిచ్చే దమ్ముందా..? : బండి సంజయ్

పౌరసరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ బియ్యం టెండర్లలో రూ.13

Update: 2023-11-23 09:25 GMT

దిశ,కరీంనగర్: పౌరసరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ బియ్యం టెండర్లలో రూ.13 వందల కోట్ల గోల్ మాల్ చేశారని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ తెలిపారు. గంగుల కమలాకర్ నిజంగా తప్పు చేయలేదని భావిస్తే…దేవుడి గుడి వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. రేషన్ షాప్ లో పేదలకు ఇచ్చే ఉచిత బియ్యం పైసలన్నీ కేంద్రమే భావిస్తోందన్నారు. ఐకేపీ కేంద్రాలు, ధాన్యం కళ్లేలా వద్ద రైతుల నుంచి కొనే వడ్ల పైసలన్నీ కేంద్రమే చెల్లిస్తోందన్నారు. వడ్లను సేకరించినందుకుగాను కేసీఆర్ ప్రభుత్వానికి బ్రోకరేజీ రూపంలో కమీషన్ కూడా కేంద్రమే ఇస్తుందన్నారు. వీటికి సంబంధించి లెక్కాపత్రంతో వివరాలు తన వద్ద ఉన్నాయని, బహిరంగ చర్చకు సిద్ధమన్నారు.

ఎన్నికల్లో భాగంగా గురువారం బహుదూర్ ఖాన్ పేట, తాహెర్ కొండాపూర్ గ్రామాల్లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు…ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రసంగిస్తూ వడగండ్ల వానతో పంట నష్టపోతే కేసీఆర్ ఈ జిల్లాకు వచ్చి ఏమన్నాడు.. ఎకరాకు రూ.10 వేలు ఇస్తానన్నాడు.. ఇచ్చిండా? తెలంగాణలో రైతులంతా నష్టపోయి ఏడుస్తుంటే నయా పైసా ఇయ్యలే.. మన సొమ్ము తీసుకుపోయి పంజాబ్ లో ఇస్తాడా? ఈసారి కేసీఆర్ బుద్ది చెప్పాల్సిందే… బియ్యం టెండర్లలో 1300 కోట్ల గోల్ మాల్ చేశాడు… కాదని చెప్పి ప్రమాణం చేేసే దమ్ముందా? గోల్ మాల్ చేసిండని నేను ఆధారాలతో సహా నిరూపిస్తా… ఉచిత రేషన్ బియ్యం పైసలన్నీ కేంద్రానివేనని నేను నిరూపిస్తా. రైతుల నుండి కొనుగోలు చేస్తున్న వడ్ల పైసలన్నీ ఇచ్చేది కేంద్రమే. చివరకు వడ్లను సేకరించి ఎఫ్ సీఐకి అప్పగించినందుకు కేసీఆర్ కు బ్రోకరేజీ కమీషన్ కూడా ఇచ్చేది కేంద్రమేనని నిరూపిస్తా…నువ్వు సిద్దమా? నేను ప్రజల కోసం పోరాడితే… గంగుల కమలాకర్ నన్ను అవినీతిపరుడంటున్నడు.. ఇప్పుడు చెబుతున్నా… కమలాకర్.. నా ఆస్తిపాస్తులు డాక్యుమెంట్లను తీసుకురా….అవన్నీ కరీంనగర్ ప్రజలకు రాసిస్తా… అట్లాగే కమలాకర్ సంపాదించిన ఆస్తిపాస్తులను డాక్యుమెంట్లను నేను తీసుకొస్తా… అవన్నీ ప్రజలకు రాసిస్తడా?...దమ్ముంటే నా సవాల్ కు సిద్ధమై రావాలి…. కరీంనగర్ ప్రజలంతా బీఆర్ఎస్ ను ఓడించేందుకు సిద్ధమైనరని తెలిసి….నా మీద దుష్ప్రచారం చేసి, దొంగ వీడియోలు స్రుష్టించి ప్రజలను గందరగోళపర్చాలనుకుంటున్నడ మీరంతా అప్రమత్తంగా ఉండాలి. వాస్తవాలు ఆలోచించి ఓటేయాలని కోరుతున్నానని తెలియజేశారు.

Tags:    

Similar News