ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలి : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన

Update: 2024-09-13 10:43 GMT

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం సిరిసిల్ల మానేరు తీరాన గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని, పోలీస్ అధికారుల సూచనలు పాటిస్తూ మండప నిర్వహకులు, యువత, ప్రజాప్రతినిధులు శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి నిమజ్జన వేడుకలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లపై చర్చించారు.

కావలసిన క్రేన్లు, జెసిబి లు, విద్యుత్ దీపాలు, నీటి సదుపాయం కల్పించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. మత్స్యశాఖ, ఎక్సైజ్, అగ్నిమాపక శాఖల అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని ఆదేశించారు. అన్ని గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా నిర్ణీత సమయానికి గణపతులను తరలించి అధికారులకు సహకరించాలని కోరారు. ఆయన వెంట సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ కళా చక్రపాణి తో పాటు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


Similar News