బీఆర్ఎస్ కి రాజీనామా చేసిన మాజీ ప్రజా ప్రతినిధులు
మాజీ జెడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, వీణవంక గ్రామ మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
దిశ, వీణవంక : మాజీ జెడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, వీణవంక గ్రామ మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వీరు మాట్లాడుతూ బీఆర్ఎస్ స్థాపించినప్పటి నుండి పార్టీలో కొనసాగుతున్నామని ప్రస్తుతం పార్టీలో తగిన గౌరవం లేదని, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, పార్టీ స్థాపించినప్పటి నుండి మేము కొనసాగుతున్నామని కానీ కౌశిక్ రెడ్డి మమ్మల్ని బీజేపీ పార్టీ వారని ముద్రవేశారని అన్నారు. మొన్న బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ పదవి పొంది తనకు నచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నాడని మాపై అక్రమ కేసులు పెట్టి వేధించాడని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి తీరు వల్లే బీఆర్ఎస్ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కౌశిక్ రెడ్డికి జరగబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. రాజీనామా చేసిన వారిలో మాజీ ఉపసర్పంచ్ సమ్మిరెడ్డి, మండల్ కో ఆప్షన్ మెంబర్ హమీద్, అమృత ప్రభాకర్ తదితరులు ఉన్నారు.