మిల్లర్ల దోపిడీని అరికట్టాలి : ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీధర్ బాబు

అకాల వర్షాలతో తడుస్తున్న ధాన్యాన్ని బేషరతుగా ప్రభుత్వమే మొత్తం కొనుగోలు చేయాలని రైతులను దోపిడీ చేస్తున్న మిల్లర్లను కట్టడి చేయాలని కోరుతూ.. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు నేతృత్వంలోని కాంగ్రెస్ శ్రేణులు జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ కు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

Update: 2023-05-23 16:25 GMT

ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

దిశ, పెద్దపల్లి టౌన్ : అకాల వర్షాలతో తడుస్తున్న ధాన్యాన్ని బేషరతుగా ప్రభుత్వమే మొత్తం కొనుగోలు చేయాలని రైతులను దోపిడీ చేస్తున్న మిల్లర్లను కట్టడి చేయాలని కోరుతూ.. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీధర్ బాబు నేతృత్వంలోని కాంగ్రెస్ శ్రేణులు జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ కు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఏఐసీసీ సెక్రెటరీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మిల్లర్లు రైతులను ఔటర్న్ పేరిట నిండా ఉంచుతున్నారని వారి దోపిడీకి ప్రభుత్వమే సహకరిస్తుందంటూ మండిపడ్డారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ధాన్యాన్ని తూకం వేసిన వెంటనే రైతుకు రసీదును అందించాలనన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలను నివారించాలని 2 నుంచి 3 కిలోలు కొనుగోలు కేంద్రాల్లోనే తూకం వేసి పంపిన మళ్లీ కటింగ్ అంటూ బస్తాకు 8 నుంచి 12 కిలోల వరకు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

యాసంగి పంటలో రా రైస్ రాదని బాయిల్డ్ మాత్రమే వస్తుందని కేంద్ర ప్రభుత్వానికి చెప్పిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఎందుకు ఔటర్న్ పేరిట దోపిడీ చేస్తుందని ప్రశ్నించారు. జిల్లాలోని మంథని పాలకుర్తి కమాన్ పూర్ ముత్తారం మండలాల్లో అకాల వర్షానికి నష్టపోయిన రైతులను నష్టపరిహారం అందించి ఆదుకోవాలన్నారు. రైతులు పండించిన పంట సకాలంలో అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్, విజయ రమణారావు, శశిభూషణ్ కాచే, సెగ్గం రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News