పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధం

రోజురోజుకూ పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో

Update: 2024-11-21 10:08 GMT

దిశ,జగిత్యాల రూరల్ : రోజురోజుకూ పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఈవి మోటార్స్ కొనుగోళ్లకు ఊతం ఇస్తుండడంతో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా తరచుగా ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ పేలిన సంఘటనలు జరుగుతుండడంతో కొనుగోలు దారుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా జగిత్యాల రూరల్ మండలం బాల పల్లి గ్రామంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలిపోయింది.

గ్రామానికి చెందిన భేతి తిరుపతి రెడ్డి మూడు నెలల క్రితం టీవీఎస్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీ కొనుగోలు చేశారు. గురువారం ఉదయం తన ఇంటి కాంపౌండ్ లోపల ఎప్పటిలాగానే స్కూటర్ కు చార్జింగ్ పెట్టాడు. అయితే ఒక్కసారిగా బైక్ బ్యాటరీ పేలి మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇంటి తలుపులు పాక్షికంగా ధ్వంసం కాగా బైక్ పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.


Similar News