ముగిసిన బండి సంజయ్ భవానీ దీక్ష

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 11 రోజులుగా చేపట్టిన భవానీ దీక్ష నేటితో ముగిసింది.

Update: 2024-10-11 15:58 GMT

దిశ, కరీంనగర్ రూరల్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 11 రోజులుగా చేపట్టిన భవానీ దీక్ష నేటితో ముగిసింది. శుక్రవారం కరీంనగర్ మహాశక్తి ఆలయంలో నిర్వహించిన రుద్ర సహిత చండీయాగం అనంతరం బండి సంజయ్ దీక్షను విరమించారు. అనంతరం సాయంత్రం ఆలయ ఆవరణలో నిర్వహించిన మహిషాసుర వథ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా నిప్పు అంటించి మహిషాసురుడిని దహనం చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా హిందువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో రేపు దసరా సందర్భంగా నిర్వహించే షమీ పూజ సహా పలు కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు.

     విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చెడుపై మంచి విజయం సాధించిన రోజు విజయదశమి అని తెలిపారు. బీజేపీ జాతీయ నాయకులు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ రాష్ట్ర ఇన్​చార్జ్ అభయ్ పాటిల్ కరీంనగర్ విచ్చేసి మహాశక్తి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు అభయ్ పాటిల్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండి సంజయ్ తో కొద్దిసేపు ముచ్చటించారు. మరోవైపు కాసేపట్లో నిర్వహించే దాండియా కార్యక్రమాన్ని తిలకించేందుకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహాశక్తి ఆలయానికి రానున్నారు. బండి సంజయ్ తో కలిసి దాండియా కార్యక్రమాలను వీక్షించనున్నారు. 

Tags:    

Similar News