విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి : కలెక్టరేట్ ఎదుట బీజేవైఎం ధర్నా
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.
దిశ, జగిత్యాల టౌన్ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేవైఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. మన ఊరు.. మన బడి కార్యక్రమంలో భాగంగా నిధులు విడుదల చేసి పాఠశాలలో మౌళిక వసతులు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ బీ.ఎస్ లత కు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలలు, కళాశాల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.