దసరా కిక్.. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు

దసరా పండుగ మద్యం ప్రియుల్లో ఫుల్ జోష్ నింపింది....

Update: 2024-10-14 02:25 GMT

దిశ,కొల్చారం/సిద్దిపేట ప్రతినిధి: దసరా పండుగ మద్యం ప్రియుల్లో ఫుల్ జోష్ నింపింది. ఈ ఏడాది దసరాకు ముందు మూడు రోజుల్లో మెదక్ జిల్లా కొల్చా రం మండలం చిన్న ఘనపూర్‌లోని ఐఎంఎల్ డిపో నుంచి మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 118 వైన్స్, దుకాణాలు 15 బార్లకు చివరి మూడు రోజులలో రికార్డు స్థాయిలలో రూ.18కోట్ల 64 లక్షలు విలువైన మద్యం సరఫరా జరిగింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 11వ తేదీ వరకు 11రోజుల్లో 8 పని దినాలలో రికార్డు స్థాయిలో రూ.40కోట్ల 50లక్షల రూపాయల విలువైన మద్యం ఐఎంఎల్ డిపో ద్వారా లైసెన్సు దుకాణాలకు బార్ అండ్ రెస్టారెంట్లకు సరఫరా జరిగింది.దీంతో ఈ ఏడాది దసరా పండుగ మద్యం ప్రియుల్లో జోస్ నింపింది అనడంలో సందేహం లేదు. ఈనెల 9న రూ.3.92 కోట్ల విలువైన 56 33 కేసుల లిక్కర్, రూ.1.16 కోట్ల విలువైన 6,999 కేసుల బీరు మద్యం దుకాణాలకు సరఫరా కాగా, 10న రూ.3.15 కోట్ల విలువైన 4527 కేసుల లిక్కర్, 0.91 కోట్ల విలువైన 5482 కేసుల బీరు సరఫరా జరిగింది.

11న రూ.6.87 కోట్ల విలువైన 9527 కేసుల లిక్కర్, రూ.2.63 కోట్ల విలువైన 15769 కేసుల బీరు మద్యం దుకాణాలకు డిపో నుంచి సరఫరా జరిగింది.మొత్తం మూడు రోజులలో రూ. 13.94 కోట్ల విలువైన లిక్కర్, రూ.4.70కోట్ల విలువైన బీర్ డిపో పరిధిలోని మెదక్,సంగారెడ్డి జిల్లాలకు చెందిన 118 వైన్స్ దుకాణాలకు, 15 బార్లకు సరఫరా చేశారు. అక్టోబర్ 1నుంచి 11 వరకు ఎనిమిది పని దినాలలో రికార్డు స్థాయిలో రూ.29.94 కోట్ల విలువైన లిక్కర్ రూ.10.56 కోట్ల విలువైన బీర్ మద్యం దుకాణాలకు సరఫరా జరిగినట్లు చిన్న ఘనపూర్ ఐఎంఎల్ డిపో మేనేజర్ నాగేశ్వరరావు తెలిపారు.

దసరా పండుగ జిల్లాలో ఈ ఏడాడి జోరుగా సాగింది. దసరా పండుగకు రూ.10 కోట్ల 86లక్షల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు మద్యం విక్రయ గణాంకాలు ప్రకారం తెలుస్తోంది. సిద్దిపేట ఐఎంఎల్ డిపో పరిధిలో సిద్దిపేట జిల్లా పరిధిలో సిద్దిపేట, మిరుదొడ్డి,గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్, సిరిసిల్ల జిల్లా పరిధిలో సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డి పేట కలుపుకొని 8 ఎక్సైజ్ సర్కిల్ ఉన్నాయి.ఆయా సర్కిల్ల పరిధిలో 141 మద్య షాపులు ఉండగా, 20 బార్లు ఉన్నాయి. ఈనెల 9వ తేదీన రూ.6కోట్లు 50 లక్షల, బతుకమ్మ పండుగ రోజున రూ.6కోట్లు 40లక్షల,దసరా పండుగకు రూ.10 కోట్ల 86లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. బతుకమ్మ,దసరా పండుగలు పురస్కరించుకొని మూడు రోజుల్లో సుమారు రూ.24కోట్ల 90 లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. సాధారణ రోజులతో పోలిస్తే దసరా పండుగను పురస్కరించుకొని మద్యం అమ్మకాలు డబుల్ అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 8 ఎక్సైజ్ సర్కిల్స్ పరిధిలో రూ.53కోట్ల 70లక్షల (49,700 కేసుల లిక్కర్, లక్ష కేసుల బీరు ) మేర మధ్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ నెలలో రూ.114 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని సిద్దిపేట ఐఎంఎల్ డిపో పరిధిలో రూ.23 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.


Similar News