సర్కార్ బడి పంతుళ్ళు మీకు ఇది భావ్యమేనా ?
ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల చేత ఉపాధ్యాయులు వెట్టి చాకిరి చేపిస్తున్నారు.
దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల చేత ఉపాధ్యాయులు వెట్టి చాకిరి చేపిస్తున్నారు. గురుకుల పాఠశాలలో గురువారం నుండి శనివారం వరకు జరిగిన రాష్ట్రస్థాయి క్రీడలలో 23 జిల్లాల నుండి విద్యార్థులు ఒక్కో గురుకుల పాఠశాల నుండి 50 మంది క్రీడల కోసం వచ్చారు. క్రీడల కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల రూపాయలు క్రీడాలు జరిపించేందుకు కేటాయించినప్పటికీ విద్యార్థులతో వచ్చిన ఉపాధ్యాయులకు సిబ్బందికి విద్యార్థుల చేత టీ కాఫీలు అందిస్తూ జర్నలిస్టుల కెమెరాకు చిక్కారు.
క్రీడలు గురుకుల హాస్టల్ లో జరుగుతున్న నేపథ్యంలో గ్రౌండ్ లో ఉన్న చెత్తాచెదారాన్ని కూడా పిల్లల చేతనే పనులు చేయించారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు గురుకుల పాఠశాలకు వెళ్తే తమ విద్యార్థుల చేత వెట్టి చాకిరి చేపిస్తున్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థుల చేత చాయిలు, కాఫీలు అందించాలని పనులు చేపిస్తున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇట్టి సంఘటన పై జిల్లా కలెక్టర్ స్పందించి విచారణ జరపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.