ధాన్యం తూకంలో రైతులను మోసం చేయొద్దు
ధాన్యం తూకంలో రైతులను మోసం చేయొద్దని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు.
దిశ,కాల్వ శ్రీరాంపూర్ : ధాన్యం తూకంలో రైతులను మోసం చేయొద్దని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలోని మడిపల్లి కాలనీ, అంకంపల్లి, మడిపల్లి, ఆషన్నపల్లి, గంగారం, పెద్దంపేట, లక్ష్మీపూర్, పందిళ్ల, ఆరేపల్లి గ్రామాల్లో సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులకు, వ్యవసాయ అధికారులకు పలు సూచనలు చేశారు. రైతుల ధాన్యాన్ని ఎలాంటి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని, సన్న ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, మండల అధ్యక్షుడు సదయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, రావి సదానందం , ఏఓ నాగార్జున, సీఈఓ కొల్లేటి శ్రీనివాస్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్లు , కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.