కేంద్ర మంత్రిని కలిసిన జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ని ఆదివారం కరీంనగర్ లోని రేకుర్తి హనుమాన్ ఆలయ పరిసరాల్లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

Update: 2024-12-29 09:26 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ని ఆదివారం కరీంనగర్ లోని రేకుర్తి హనుమాన్ ఆలయ పరిసరాల్లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

నూతనంగా ఎన్నికైన సభ్యులను కేంద్ర మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల వెంట తాను ఎప్పుడూ ఉంటానని చెప్పారు. సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సమర సేన, సెక్రెటరీ జబీ, జాయింట్ సెక్రటరీలు శ్రీకాంత్, చంద్రకళ, పబ్లిసిటీ సెక్రటరీ కిరణ్, కార్యవర్గ సభ్యులు శేఖర్, భాగ్యలక్ష్మి, శ్రావ్య పాల్గొన్నారు.


Similar News