దిశ కోరుట్ల ఆర్సీ ఇంచార్జి గుండేటి కిరణ్ హఠాన్మరణం

గుండెపోటుతో దిశ పత్రిక కోరుట్ల ఆర్సీ ఇంచార్జి గుండెటీ కిరణ్ (36) అకస్మాత్తుగా మృతి చెందారు.

Update: 2023-07-17 10:35 GMT

దిశ, కోరుట్ల టౌన్ : గుండెపోటుతో దిశ పత్రిక కోరుట్ల ఆర్సీ ఇంచార్జి గుండెటి కిరణ్ (36) అకస్మాత్తుగా మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. ఉదయం ఓ ప్రెస్ మీట్ కు వెళ్లి వచ్చిన కిరణ్ ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే కిరణ్ మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కిరణ్ కుటుంబం శోక సంద్రంలో మునిగి పోయింది.

కిరణ్ పార్థీవ దేహానికి కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్, రాష్ట్ర టీయూడబ్ల్యూజే కార్యదర్శి గంగుల రాంగోపాల్, జిల్లా అధ్యక్షుడు శికారి రామకృష్ణ, అంజు, తదితరులు నివాళుర్పించారు. కిరణ్ కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. 20 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో కిరణ్ చేసిన సేవలను కోరుట్ల ప్రెస్ క్లబ్ సభ్యులు కొనియాడారు. అతని ఆకస్మక మరణం పత్రికా రంగానికి తీరని లోటని అన్నారు. అయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Similar News