వేగానికి మారు పేరు దిశ
కాలంతో సమానంగా పరిగెడుతూ సమాజంలో జరిగే సంఘటనలను ఎప్పటికప్పుడు వార్తల రూపంలో వేగంగా అందించడంలో 'దిశ' పత్రిక ప్రత్యేక స్థానం సంపాదించుకుందని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు.
దిశ,వేములవాడ : కాలంతో సమానంగా పరిగెడుతూ సమాజంలో జరిగే సంఘటనలను ఎప్పటికప్పుడు వార్తల రూపంలో వేగంగా అందించడంలో 'దిశ' పత్రిక ప్రత్యేక స్థానం సంపాదించుకుందని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. సోమవారం వేములవాడ పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో దిశ- 2025 ఏఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో అన్ని పత్రికలకు దీటుగా ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తూ దిశ పత్రిక ముందంజలో ఉందని, రాబోయే రోజుల్లోనూ ఇలానే పత్రిక ప్రజా సమస్యలను వెలికి తీస్తూ ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.