దిశ ఎఫెక్ట్​.. మిషన్ భగీరథ నీటి శాంపిల్స్ ల్యాబ్ కు తరలింపు

ఎల్లారెడ్దిపేట మేజర్ గ్రామపంచాయతీలో గల ఎనిమిదవ వార్డులో సరఫరా అవుతున్న మిషన్ భగీరథ తాగునీటిని అధికారులు పరిశీలించారు.

Update: 2025-03-18 11:17 GMT
దిశ ఎఫెక్ట్​.. మిషన్ భగీరథ నీటి శాంపిల్స్ ల్యాబ్ కు తరలింపు
  • whatsapp icon

దిశ,ఎల్లారెడ్దిపేట : ఎల్లారెడ్దిపేట మేజర్ గ్రామపంచాయతీలో గల ఎనిమిదవ వార్డులో సరఫరా అవుతున్న మిషన్ భగీరథ తాగునీటిని అధికారులు పరిశీలించారు. మంగళవారం దిశ దినపత్రికలో ‘కలుషిత నీటి సరఫరా.. రంగు మారుతున్న మిషన్ భగీరథ నీరు’అనే శీర్షికన ప్రచురితమైన వార్తకు మిషన్ భగీరథ అధికారులు స్పందించి శాంపిల్స్ సేకరించారు.

    ఎల్లారెడ్దిపేటలో గల ఎడ్ల అంగడి బజారు, కేసీఆర్ ఆత్మగౌరవ సముదాయం, ఎంపీడీఓ కార్యాలయం, కిష్టంపల్లిలో గల వాటర్ ట్యాంక్ లలోకి సరఫరా అవుతున్న మిషన్ భగీరథ వాటర్ ను పరిశీలించి శాంపిల్స్ సేకరించారు. వేములవాడ మండలం అగ్రహారంలో గల మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో గల ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి సమాచారం అందిస్తామని ఎల్లారెడ్దిపేట మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, మిషన్ భగీరథ సూపర్ వైజర్ కిషన్, బాబు ఉన్నారు. 


Similar News