విభిన్న కథనాల ప్రచురణలో ‘దిశ’దిట్ట

ప్రజా శ్రేయస్సు కోసం విభిన్న కథనాల ప్రచురించడంలో ‘దిశ’దిట్టని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి కొనియాడారు.

Update: 2024-12-27 09:19 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : ప్రజా శ్రేయస్సు కోసం విభిన్న కథనాల ప్రచురించడంలో ‘దిశ’దిట్టని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి కొనియాడారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని తమ నివాసంలో ‘దిశ’దిన పత్రిక 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. నిత్యం సమాజంలో జరుగుతున్న విషయాలను వేగంగా ప్రజలకు చేరవేస్తూ, ప్రజలను చైతన్య పరచడంలో దిశ పత్రిక ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు. సమాజ శ్రేయస్సు కోరుతూ, విభిన్న కథనాలను ప్రచురిస్తూ ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహను కలిగించేలా కృషి చేస్తుందన్నారు.

    సమసమాజ నిర్మాణానికి పాటుపడుతున్న దిశ పత్రిక ప్రతి ఏడాది ప్రజల ఆదరణను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్తోందని, మీడియా రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దిశ పత్రిక పాఠకులకు, అభిమానులకు, జిల్లా ప్రజలందరికీ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు లింగంపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ రావు, దిశ జిల్లా ప్రతినిధితో పాటు ఆయా మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.


Similar News