ప్రభుత్వ పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి గంగుల కమలాకర్

ప్రభుత్వ పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

Update: 2023-08-28 12:34 GMT

దిశ, కరీంనగర్ టౌన్ : ప్రభుత్వ పథకాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ నుంచి టీఎస్ ఓబీఎంస్ పథకం ద్వారా వికలాంగుల (వినికిడి లోపం) ఉన్నవారికి మంజూరైన సెల్ ఫోన్లను జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్బంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హత గల దివ్యాంగులు టీఎస్ ఓబీఎంఎస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడుతూ.. డీఎస్ ఓబీఎంఎస్ ద్వారా జిల్లాలో 51 శాతం కంటే ఎక్కువ చెవుడు ఉన్న ఐదుగురికి సెల్ ఫోన్లను అందజేశామని తెలిపారు.

అందులో ఇంటర్ లేదా డిస్టెన్స్ చదివే 16 నుంచి 21 సంవత్సరాల మద్య వయస్సు ఉన్న వారిని, డీగ్రీ ఆ పైన చదువుతున్న 18 నుంచి 25 ఏళ్ల వయసు గల వారికి, 16 నుంచి 50 ఏళ్లు పైబడి ఎస్సెస్సీ చదివిన వారిని అర్హులుగా గుర్తించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. గోపి, అదనపు కలెక్టర్లు లక్ష్మికిరణ్, అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News