రాష్ట్రంలో రాక్షస పాలన

మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం శోచనీయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మండిపడ్డారు.

Update: 2025-03-14 09:44 GMT
రాష్ట్రంలో రాక్షస పాలన
  • whatsapp icon

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం శోచనీయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మండిపడ్డారు. జగదీశ్​రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని అన్నారు.

    ఇదే విషయాన్ని ప్రశ్నించిన జగదీశ్​రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. రైతులు సాగునీరు అందక అలమటిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజల చేతుల్లో వారికి పరాభవం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  


Similar News