CP : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు

కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు.

Update: 2024-11-01 15:17 GMT

దిశ, కరీంనగర్ : కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల దృష్ట్యా నియమనిబంధనలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సంబంధిత ఏసీపీ ల నుంచి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిర్వహించకూడదని తెలిపారు.

    తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. అనుమతుల కోసం దరఖాస్తు చేయడం ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన భద్రతాపరమైన చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే ఇతరులను గాయపరిచే విధంగా ఉండే వస్తువులు, మారణాయుధాలను ధరించి సంచరించకూడదన్నారు. రోడ్లు, ప్రజలకు ఉపయోగపడే ఇతర స్థలాల్లో జనాన్ని సమీకరించకూడదని సూచించారు. మ్యూజిక్ లు, పాటలు, ప్రసంగాలు, రణగోణ ధ్వనులు చేయవద్దని కోరారు. ఈ ఉత్తర్వులు ఈనెల 30 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు.  

Tags:    

Similar News