దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం.. కాంగ్రెస్ శ్రేణులు
టీపీసీసీ పిలుపు మేరకు మంథనిలో కాంగ్రెస్ శ్రేణులు దశాబ్ది దగా పేరుతో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
దిశ, మంథని : టీపీసీసీ పిలుపు మేరకు మంథనిలో కాంగ్రెస్ శ్రేణులు దశాబ్ది దగా పేరుతో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేయడం సిగ్గుచేటు అన్నారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలరోజులు దాటినా ఇప్పటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప చేసింది ఏంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పెండ్రు రమ, హన్మంతు, కాంగ్రెస్ నాయకులు అజీమ్ ఖాన్, ఒడ్నాల శ్రీనివాస్, శేఖర్, కిషన్, రవితేజ గౌడ్, నాగరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.