సీఎం కేసీఆర్ రాజ్యం.. రైతురాజ్యం : ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

సీఎం కేసీఆర్ రాజ్యం.. రైతు రాజ్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు.

Update: 2023-06-03 09:11 GMT

దిశ, కోరుట్ల రూరల్ : సీఎం కేసీఆర్ రాజ్యం.. రైతు రాజ్యమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మండల పరిధిలోని పైడిమడుగు గ్రామంలో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా పైడిమడుగు, జోగన్ పల్లి, మాదాపూర్ రైతులతో రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి మద్దతు ధర అందిస్తున్నారని తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలతో కేసీఆర్ ప్రతి ఎకరాకు సాగునీరు అందించారని తెలిపారు. రైతుబంధు, రైతు భీమా పథకాలు తెలంగాణలో రైతును రాజును చేశాయని తెలిపారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మకరంద మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తరువాత రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యల కారణంగా సాగు మరింత పెరిగిందన్నారు. ప్రభుత్వ అధికారుల సూచనలు పరిగణిస్తూ రైతులు మంచి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ మంచి దిగుబడి పొందాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్ కుమార్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య, సర్పంచ్ ల ఫోరం జిల్లా గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేష్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, సర్పంచులు దమ్మ బీమరెడ్డి, రాజనర్సు రాజనర్సయ్య, ఎంపీటీసీలు గడికొప్పుల మాధురి గోపాల్, చెపూరి కృష్ణారెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ లు జగన్మోహన్ రావు, గడ్డం ఆదిరెడ్డి, కోరుట్ల ఎంపీడీవో పీ.నీరజ, మండల వ్యవసాయ అధికారిని నాగమణి, పశువైద్య కళాశాల డీన్ మాధవరావు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News