సీఎం కేసీఆర్ మాకు బలం.. కార్యకర్తలే మా బలగం: మంత్రి గంగుల కమలాకర్
భావి తరాల భవిష్యత్తును నిర్ణయించేంది బీఆర్ఎస్ యేనని, సీఎం కేసీఆర్ మాకు బలం అయితే.. కార్యకర్తలే తమకు బలగమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
దిశ, కరీంనగర్: భావి తరాల భవిష్యత్తును నిర్ణయించేంది బీఆర్ఎస్ యేనని, సీఎం కేసీఆర్ మాకు బలం అయితే.. కార్యకర్తలే తమకు బలగమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీఆర్ఎస్ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే సీఎం కేసీఆర్ కు కార్యకర్తలు ఎల్లప్పుడూ అండగా ఉండాలన్నారు.
బడుగు, బలహీన వర్గాల పార్టీ బీఆర్ఎస్ అని, భవిష్యత్తు దేశం అంతటా బీఆర్ఎస్ దేనని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీలో ఉన్న కులాలు, మతాల వారు ఏ పార్టీలో లేరని ఆయన అన్నారు. తండ్రీ, కొడుకుల మధ్య తేడాలొస్తే ఇంట్లోనే మాట్లాడుకొని పరిష్కరించుకుందామని ఆయన అన్నారు. మనసులో కక్ష పెంచుకొని ఎవరూ కూడా పార్టీకి దూరం కావొద్దన్నారు. దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలో లేని గొప్ప సంక్షేమ పథకాల కేవలం తెలంగాణలో మాత్రమే అమలవుతున్నాయని తెలిపారు.
ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూడాలని కేసీఆర్ చూస్తే.. మోడీ మాత్రం వారిని కన్నీళ్లు పెట్టిస్తున్నడని ఆరోపించారు. ఆడబిడ్డ కన్నీరు పెడితే అరిష్టమని, తెలంగాణ ఆడబిడ్డనుఈ రకంగా ఏడిపించడం మోడీ ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీకీ తామంతా హక్కుదారులమని, ఆ్మత్మీయ సమ్మేళనాల త్వరలో అందరి దగ్గరికి వస్తామని, తప్పులు జరిగితే సవరించుకుంటామని ఆయన అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు ఢిల్లీ పార్టీలని, వాళ్లు అధికారంలోకి వస్తే మన వనరులను దోచుకెళ్తరని ఆరోపించారు.