మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే : Ex MP Vinod Kumar
మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.
దిశ, చొప్పదండి : మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని చాకుంట గ్రామంలో రూ.2.18 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మాజీ ఎంపీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకర శంకర్ సుడా చైర్మన్ జీ.వీ రామకృష్ణా రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్ది శంకర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి రూ.2.18 కోట్ల నిధులు కేటాయించిన ఎమ్మెల్యే రవిశంకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరుతున్నాయని అన్నారు. తనను మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు ఆంధ్ర పాలకుల పాలనలో రాష్ట్రంలోని పల్లెలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. తెలంగాణ వచ్చాక పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని తెలిపారు.
మూడోసారి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని, మన ఇంటి పార్టీ మన గులాబీ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పిడుగు మంగ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, ఎంపీపీ చిలుక రవీందర్, పురపాలక సంఘం అధ్యక్షురాలు గుర్రం నీరజ భూమరెడ్డి, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య వినయ్ కుమార్, సహకార సంఘం అధ్యక్షుడు వేలు మల్లారెడ్డి, మార్కెట్ చైర్మన్ చుక్కారెడ్డి సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గుంట రవి, సర్పంచ్ లు సురేష్ లావణ్య, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు అరెళ్లి చంద్రశేఖర్, అజయ్, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.