BJP leaders : రామడుగు బ్రిడ్జిని ప్రారంభించాలంటూ గళమెత్తిన కాషాయం..

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిని పనులు పూర్తి చేసి వెంటనే ప్రారంభించాలని బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగి గళమెత్తారు.

Update: 2024-07-25 10:02 GMT

దిశ, రామడుగు : కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిని పనులు పూర్తి చేసి వెంటనే ప్రారంభించాలని బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగి గళమెత్తారు. ఈ సందర్భంగా రామడుగు మండల కేంద్రంలో రోడ్డు పై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. పనులు పూర్తయినా అధికారుల అసమర్థతతో బ్రిడ్జి వినియోగంలోకి తేవడం లేదని ఆందోళన కారులు అధికారులపై మండిపడ్డారు. ఐదు సంవత్సరాలు గడిచినా బ్రిడ్జి పనులు పూర్తి చేయని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను నమ్మబలికి ఇచ్చిన హామీలు నెరవేర్చని అసమర్ధులని విమర్శించారు. భూసేకరణ చేపట్టకుండానే బ్రిడ్జి పనులు ఎలా మొదలు పెట్టారంటూ తహశీల్దార్ భాస్కర్ ను నిలదీశారు. వెంటనే జిల్లా స్థాయి యంత్రాంగాన్ని పిలవాలని లేనియెడల రాస్తారోకో విరమించేదే లేదంటూ భీష్ముంచుకొని కూర్చున్నారు.

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల కాలంలో ఏడుసార్లు బ్రిడ్జ్ కోతకు గురైనా గాని అధికార యంత్రాంగం అసమర్ధ ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హయాంలో బ్రిడ్జి ప్రారంభం అయితే అదే ప్రతిపక్ష ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న మేడిపల్లి సత్యం సుంకే రవిశంకర్ ను చేతగాని దద్దమ్మ అంటూ విమర్శించారు . ఆనాడు ప్రతిపక్ష నేతగా ఇదే బ్రిడ్జి పై రాస్తారోకో చేపట్టి కాంగ్రెస్ పార్టీలో నేను ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజులకే బ్రిడ్జ్ పనులను చేపిస్తానంటూ అప్పుడు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడు ఎందుకు ముందుకు రావడం లేదు అంటూ బీజేపీ శ్రేణులు విరుచుకుబడ్డారు. బీజేపీ శ్రేణులు చేపట్టిన రాస్తారోకో దాదాపు రెండు గంటల వరకు చేరుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మండల నాయకులు పొన్నం శ్రీనివాస్ గౌడ్, ఒంటెల కరుణాకర్ రెడ్డి, ఉప్పు కిషన్, బొజ్జ తిరుపతి, రామ్ లక్ష్మణ్, మోడీ రవి, బండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News