దిశ ఎఫెక్ట్.. మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బిగించిన బయోమెట్రిక్...

దిశ కథనం పై ఉన్నతాధికారులు స్పందిస్తూ మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బయోమెట్రిక్ బిగించారు.

Update: 2025-01-07 09:20 GMT

దిశ, కోరుట్ల : దిశ కథనం పై ఉన్నతాధికారులు స్పందిస్తూ మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బయోమెట్రిక్ బిగించారు. గత డిసెంబర్ 31న 'సమయపాలన పాటించని వైద్యులు' అనే శీర్షికతో కథనం ప్రచురించడమైంది. గత కొద్ది రోజులుగా సమయపాలన పాటించడం లేదని వస్తున్న వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ఉన్నతాధికారులు విచారణ జరిపి రోగులకు మెరుగైన చికిత్స అందించాలనే నేపథ్యంలో బయోమెట్రిక్ బిగించారు.

ఈ నేపథ్యంలో ఆసుపత్రి సూపరిండెంట్ సాజిద్ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఆస్పత్రి ఆవరణలో బయోమెట్రిక్ బిగించడంతో రోగులకు నిరంతరం సేవలు అందుతాయంటూ పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Similar News