అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

అప్పుల బాధలు తాళలేక, ఈఎంఐ( ఫైనాన్స్)కట్టలేని స్థితిలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలో ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది.

Update: 2024-07-04 07:21 GMT

దిశ, కోనరావుపేట: అప్పుల బాధలు తాళలేక, ఈఎంఐ( ఫైనాన్స్)కట్టలేని స్థితిలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలో ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సావణపల్లి స్వామి( 35) ఆటో డ్రైవర్ అప్పుల బాధతో తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు స్వామి ఆటో నడుపుతూ, కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో ఉచిత బస్ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఆటోలు సరిగా నడవడం లేదు. దీంతో అప్పుచేసి కొనుకున్న ఆటోలకు ఫైనాన్స్ కట్టలేకపోవడంతో ఫైనాన్స్ నిర్వాహకులు ఆటోను లక్కేలడంతో, ఆటు అప్పులు కట్టలేక, ఈఎంఐలు కట్టలేక మనస్తాపం చెంది, ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు స్వామికి తల్లి మైసవ్వ (70) భార్య లాస్య, కుమారుడు శ్రీ హన్స్ 17 నెలలు ఉన్నారు. కుమారుడి మృతితో తల్లి అతని భార్య రోదనలతో గ్రామం మిన్నంటగా.. నిరుపేద స్వామి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామ ప్రజలు, ఆటో యూనియన్ సభ్యులు కోరుతున్నారు.


Similar News