తెలంగాణ వచ్చాకే.. రైతుల కళ్లల్లో ఆనందం : ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు సాగునీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలో ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి పెరుగుదల కారణంగా ప్రతి రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తుందని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
దిశ, జమ్మికుంట : తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు సాగునీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలో ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి పెరుగుదల కారణంగా ప్రతి రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తుందని ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
బుధవారం జమ్మికుంట పట్టణంలోని స్వాతి గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధ ఉత్సవాల్లో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గం సాగునీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో చెక్ డ్యాం నిర్మాణం జరిగిందన్నారు. దాంతో రైతులు తమ పంటలను పుష్కలంగా పండించుకుంటున్నారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ, పూడిక తీతతో భూగర్భ జలాలు పెరిగాయ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు రాష్ట్రంలో 5.710 లక్షల ఎకరాలకు అందిన సాగు నారు, నేడు 17.23 లక్షల ఎకరాలకు చేరిందని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నేడు 1.81 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి, నీటి పారుదల శాఖ అధికారులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.