కౌంటింగ్ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలి

లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులకు తెలిపారు.

Update: 2024-06-01 13:57 GMT

దిశ, రామగిరి : లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులకు తెలిపారు. శనివారం పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ రామగిరిలోని సెంటినరీ కాలనీలో ఉన్న జేఎన్టీయూ మంథని కళాశాలను అదనపు కలెక్టర్ లు జే.అరుణశ్రీ, జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ లతో కలిసి పరిశీలించి కౌంటింగ్ ఏర్పాట్ల పై అధికారులకు పలు సూచనలు చేశారు.

పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ జేఎన్టీయూ మంథని కళాశాలలోని కౌంటింగ్ హాళ్లను, స్ట్రాంగ్ రూములను తనిఖీ చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద బ్యారికేడ్లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, ఎన్నికల ఏజెంట్లు, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేక ఎంట్రెన్స్ ఉండేవిధంగా చూడాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కొరకు చేసిన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని, పాసులు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రం లోపలికి అనుమతించాలని అన్నారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్ కు వేసిన సీల్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారులు, తహసిల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Similar News