MLA : బతుకమ్మ, దసరాకు అన్ని ఏర్పాట్లు చేయాలి..

రాబోయే బతుకమ్మ, దసరా ఉత్సవాలకు గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.

Update: 2024-09-28 09:11 GMT

దిశ, తిమ్మాపూర్ : రాబోయే బతుకమ్మ, దసరా ఉత్సవాలకు గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. శనివారం తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్లోని మానకొండూర్ నియోజకవర్గ ప్రజా భవన్ కార్యాలయంలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవో, ఎంపీవో లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండువకు గ్రామాల్లో ప్రస్తుతం ప్రజా ప్రతినిధులు లేనందున మీరే పూర్తి బాధ్యతలు తీసుకొని గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో మహిళలు బతుకమ్మ ఆడుకునే స్థలంలో పారిశుధ్యం, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, గ్రామాల్లో కూడా వీధులన్నీ క్లీన్ చేసి వీధి దీపాలు కూడా ఏర్పాట్లు చేయాలని, ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడిఓ, ఎంపీఓ లు పాల్గొన్నారు.


Similar News