యథేచ్ఛగా బ్లాస్టింగ్‌లు..అనుమతులు లేకుండా జిలెటిన్ స్టిక్స్ వాడకం

ముస్తాబాద్ మండలం నుండి ఎల్లారెడ్డిపేట మండలం వరకు జిలెటిన్ స్టిక్స్

Update: 2024-12-27 02:21 GMT

దిశ, ఎల్లారెడ్డిపేట : ముస్తాబాద్ మండలం నుండి ఎల్లారెడ్డిపేట మండలం వరకు జిలెటిన్ స్టిక్స్ వాడకం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇటు ఎల్లారెడ్డిపేట అటు ముస్తాబాద్ మండలం లో జిలెటిన్ స్టిక్స్ వినియోగంపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిలెటిన్ స్టిక్స్ వినియోగస్తూ వ్యవసాయ పొలాల్లో పెద్ద పెద్ద బండరాళ్లను పేల్చుతూ జిలెటిన్ స్టిక్స్ వాహనాల యజమానులు శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారు. ముస్తాబాద్ మండలంలో బ్లాస్టింగ్‌లు చేయడానికి అనుమతులు తీసుకోకుండానే బ్లాస్టింగ్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముస్తాబాద్ మండలంలో జిలెటిన్ స్టిక్స్ ట్రాక్టర్లు ముస్తాబాద్‌లో సుమారు 10, నామపూర్‌లో 7, రాంరెడ్డిపల్లెలో 8, తెర్లుమద్ధిలో 3 జిలెటిన్ స్టిక్స్ ట్రాక్టర్లు ఉన్నట్లు సమాచారం. బండరాళ్లను ఎక్కడ పేలుచాలన్నా ముస్తాబాద్ మండలంలో గల జిలెటిన్ స్టిక్స్ ట్రాక్టర్లు ఎల్లారెడ్దిపేట, ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు.

దిగుమతి ఇలా...

జిలెటిన్ స్టిక్స్‌ను సదరు ట్రాక్టర్ యజమానులు సిద్దిపేట, హైదరాబాద్ నుంచి ఒక్కో జిలెటిన్ స్టిక్స్ బ్యాగ్ రూ.12వేల నుంచి రూ.13వేలకు ఒక్క బ్యాగ్ చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఇలా వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది. ఒక్కో బండ రాళ్లను పేల్చడం కోసం ఒక్కో హోల్‌కు రూ.160 నుంచి రూ.200వరకు జిలెటిన్ స్టిక్స్ ట్రాక్టర్ల యజమానులు తీసుకుంటున్నారు.

లైసెన్స్ అనుమతులకు మంగళం...

జిలెటిన్ స్టిక్స్ వాహనాలు కొనుగోలు చేయడం కోసం రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ శాఖ నుంచి మరి ముఖ్యంగా మైనింగ్, పోలీస్ శాఖ నుంచి కూడా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, సదరు జిలెటిన్ స్టిక్స్ ట్రాక్టర్లను ఎలాంటి అనుమతులు లేకుండా వినియోగిస్తున్నారు.


Similar News