ఆసక్తికర సన్నివేశం.. ప్రత్యర్ధులు కలిసి ప్రచారం చేసిన వేళ

ఎన్నికలంటేనే సాధారణంగా దాదాపుగా యుద్ధ వాతావరణం నెలకొంటుంది.

Update: 2023-10-20 12:02 GMT

దిశ,కొడిమ్యాల : ఎన్నికలంటేనే సాధారణంగా దాదాపుగా యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అలాంటిది రెండు వేరు వేరు పార్టీలకు చెందిన ప్రత్యర్ధులు కలిసి ఒకే చోట ప్రచారం నిర్వహిస్తే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. దీనికి తోడు గతంలో అందరూ కలిసి ఒకే పార్టీలో ఉండి కాలక్రమేణా మనస్పర్థాలతో వేర్వేరు పార్టీల నుండి ప్రచారం నిర్వహిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఇలాంటి సంఘటన శుక్రవారం రోజున జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన బోడిగె శోభ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని చెప్యాల గ్రామంలో ప్రచారానికి రావడం జరిగింది.

అంతకుముందే కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మెన్నేని రాజ నర్సింగరావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామంలోని ఒక వర్గానికి చెందిన సంఘ భవనంలో ఆ వర్గానికి చెందిన వ్యక్తులతో ఎన్నికల ప్రచారంలో భాగంగా సమావేశం నిర్వహిస్తుండగా మాజీ ఎమ్మెల్యే శోభ అక్కడికి చేరుకుని వారితో పాటు సమానంగా కూర్చుని తాను కూడా ప్రచారం నిర్వహించడం అందరిని ఆలోచనలో పడేసింది. బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శిస్తూ వాక్యాలు చేయడం గందరగోళాన్ని సృష్టించింది. ఏది ఏమైనప్పటికీ రెండు పార్టీలకు చెందిన నాయకులు ఓకే చోట ప్రచారం నిర్వహించడం మండలంలో సంచలనం రేకెత్తించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది.

Tags:    

Similar News