తండ్రి మరణంతో ఆగిన తనయుడి గుండె

తండ్రి మరణ వార్త విని గుండెలు పగిలేలా రోదించాడు ఆ కొడుకు..చివరి చూపు కోసం గల్ఫ్ దేశం నుండి హుటాహుటిన స్వగ్రామం చేరుకున్నాడు.

Update: 2024-08-17 10:27 GMT

దిశ, కథలాపూర్ : తండ్రి మరణ వార్త విని గుండెలు పగిలేలా రోదించాడు ఆ కొడుకు..చివరి చూపు కోసం గల్ఫ్ దేశం నుండి హుటాహుటిన స్వగ్రామం చేరుకున్నాడు. కన్నీటితో కడసారి వీడ్కోలు పలికాడు.. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక నాలుగు రోజుల్లోనే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని గంభీర్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

    గ్రామానికి చెందిన గండిగ రమేష్(43) ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లాడు. కాగా ఇటీవల తండ్రి చనిపోగా దహన సంస్కారాల నిమిత్తం వచ్చి కార్యక్రమం పూర్తి అయిన మరుసటి రోజున గుండె పోటు వచ్చింది. ఆసుపత్రికి తరలించే లోపే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. 

Tags:    

Similar News