ప్రభుత్వ భూమిని కాపాడాలని అర్ధనగ్న ప్రదర్శన
పెద్దపల్లి కలెక్టరేట్ లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గోశిక రాజేశం అర్ధనగ్న ప్రదర్శనల చేశారు.
దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి కలెక్టరేట్ లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గోశిక రాజేశం అర్ధనగ్న ప్రదర్శనల చేశారు. ఓదెల మండలానికి చెందిన మడక గ్రామంలో పది ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. గతంలో ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో భామిని కాపాడాలని ఆయన కలెక్టర్ ను ఆదేశించారు. గత ఆగస్టు నెలలో పోలీస్ అధికారులతో వచ్చి రెవెన్యూ అధికారులు సర్వే చేసి భూమికి హద్దులు నిర్ణయించారు. అయినప్పటికీ మళ్లీ భూమి ఆక్రమణకు గురైందని ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని అధికారులను కోరాడు.