మానకొండూరు నియోజకవర్గంలో 81.33 పోలింగ్ శాతం నమోదు..
అసెంబ్లీ ఎన్నికల్లో మానకొండూరు నియోజక వర్గానికి ఓ ప్రత్యేకత ఉంది.
దిశ, మానకొండూరు, ఆర్ సీ : అసెంబ్లీ ఎన్నికల్లో మానకొండూరు నియోజక వర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. మూడు జిల్లాలను కలుపుకొని ఉన్న కరీంనగర్ జిల్లా, సిద్ధిపేట జిల్లా, రాజన్న సీరిసిల్ల జిల్లా ఈ మూడు జిల్లాలను కలుపుకొని ఉన్న మానకొండూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ చైతన్యం ప్రదర్శించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల ఓట్ల పోలింగ్ శాతం మొదటగా 1.మానకొండూరు(83.17), 2.శంకరపట్నం(81.53), 3.తిమ్మాపూర్ (8124), 4.గన్నేరువరం (86.17), 5. బెజ్జంకి (78.21), 6.ఇల్లంతకుంట (78.60) ఈ ఆరు మండల కేంద్రాల్లో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదయింది.
నియోజక వర్గంలోని అన్ని మండలాల కంటే అధికంగా గన్నేరు వరం మండలం 86.17పోలింగ్ కావడం చాల గొప్ప విషయంగా భావించాలి. మానకొండూరు నియోజకవర్గంలోమొత్తం ఓటర్లు (2,21,613) ఉండగా ఇందులో పురుషుల ఓట్లు 1,08,846, స్త్రీల ఓట్లు 1,12,766, ఇతరులు 1 ఉండగా, పోలైన పోలింగ్ ఓట్లు (1,80,236) ఓటు హక్కు వినియోగించుకొన్నారు. పురుషుల కంటే మహిళలే ఓటు వేయడంలో ఆసక్తి చూపారు. మానకొండూరు లో 81.33 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.