Pc Ghosh Commission: కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు మరోసారి పొడిగింపు

కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు మరోసారి పొడిగించారు.

Update: 2024-08-31 13:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం విచారణ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చేస్తున్న విచారణ గడువును మరో 2 నెలల పాటు పొడిగిస్తూ ఇవాళ రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమస్యలు వెలుగుచూడటంతో కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ తో న్యాయ విచారణ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. తొలుత 100 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి జూన్ వరకు నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను కోరింది. కానీ లోక్‌సభ ఎన్నికల కోడ్ కారణంగా కమిషన్ పని ప్రారంభించేందుకు జాప్యం ఏర్పడింది. దీంతో ఆగస్టు 31 వరకు గడువును పొడిగించగా ఆ గడువు నేటితో ముగియనున్నది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెలాఖరు వరకు నివేదిక ఇవ్వాలని మరోసారి గడువు పెంచించింది.


Similar News