కడియం కాకకు రాజయ్యే పోటీనా..? (వీడియో)
తెలంగాన్ల రాజకీలన్ని ఒగెత్తయితే తాటికొండ రాజన్న రాజకీయం ఒగెత్తు.. రాష్ట్ర రాజకీయాలన్ని రాజన్న సుట్టే తిరగుతున్నయ్..
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాన్ల రాజకీలన్ని ఒగెత్తయితే తాటికొండ రాజన్న రాజకీయం ఒగెత్తు.. రాష్ట్ర రాజకీయాలన్ని రాజన్న సుట్టే తిరగుతున్నయ్.. కడియం కాకకు నాకు పోటీ అన్నట్టే చేస్తున్నడు .. నిన్న మొన్నటి దాన్క నా సీట్లకొస్తనంటె నేనెంట్టూకుంటనని జబ్బలు సరిసిన రాజన్న ఇగియ్యాల కడియం కాకను సూడంగనే సల్లబడ్డట్టున్నడు గదా.. ఇంతకు ఏందే కాక ముచ్చట అంటరా ఇగో ఇది సూడుర్రి మీకే తెలుస్తది..
వ్వా.. సూశిర్రా.. రాజకీయం అంటేనే రంగుల రట్నం అంటరు గదా.. ఆగో ఇది సూస్తే వాజీబే అనిపియ్యట్లే.. నేనంటె నేను నాకంటె నాకు.. ఏ బిడ్డా స్టేషన్ గన్ పూర్ నా అడ్డ అన్నట్టే నిన్న మొన్నటి దాన్క రంకెలేశిన రాజన్న ఆగిప్పుడు సూడుర్రి ఏం చేసిండో.. జనగాం జిల్లా పాలకుర్తి మండలంలున్న వల్మిడిల అయినా సీతారాముులోరి గుడి ఓపెనింగుల ఇగో ఇట్ట కడియం కాక పక్కపొంటి గూసోని జోలిపెట్టిండు రాజన్న.. అంత మంచిగనే ఉన్నది గనీ నిన్నమోన్నటి దాన్క టికెట్టు నాకె రావాలె.. నా టికెట్టు నాకెట్టు నాకెఇయ్యాలె.. దుక్కి దున్నిన.. నారుపోసిన.. నాటు పెట్టిన.. నీరుపోసినా.. పంటగోశిన అని శెప్పిన ముచ్చట్లెక్కడ పాయెనే రాజన్న అనుకుంటుర్రట గన్ పూర్ పబ్లిక్కు.. సరే గయ్యిన్ని మాకెందుకు గనీ.. ఇద్దరు ఒక్క తాన కూసున్నరంటె టికెట్టు నీకా నాకా అన్న ముచ్చటేమన్న ఎల్లబెట్టుకున్నరో.. ఏమో తియ్యిర్రి గనీ ఇప్పుడు రాజన్న రదమే ఎటు కదులుద్దో అనుకుంటుర్రు శానా మంది దాన్క.. ఇంకో ముచ్చటేందంటె రాజయ్య సారు ఉన్నోడుండకాడుండడు గదా.. ఎప్పుడు ఏదో ఒగ తీట పంచాది జోలెగట్టుకుంటడు గదా.. ఇగో ఇప్పుడు సుతట్టనే దామోదర రాజనర్సిమ్మ సారు కాడికి పొయ్యొచ్చిండట.. అంటె మరి కారు దిగి శెయ్యి పార్టోల్లతోని సోపతికి తయ్యారయ్యితుండో.. ఏమో మరి ఒగ కోయిల తొందర పడి ముందే గూయొచ్చు.. ఎవ్వలికెరుక గనీ.. అంత మంచిగనే ఉన్నది గనీ రాజన్నకే మల్లోపాలి ఎమ్మెల్యే అయ్యో యోగం ఉన్నదో లేదో సూడాలె ఇగ...