Janwada Case: జన్వాడ కేసులో కొనసాగుతోన్న పోలీసుల దర్యాప్తు.. విజయ్ మద్దూరి ఫోన్ స్విచ్ ఆఫ్
జన్వాడ ఫామ్‌హౌస్ కేసు (Janwada Farm Hose Case)లో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: జన్వాడ ఫామ్‌హౌస్ కేసు (Janwada Farm Hose Case)లో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. పార్టీ నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బావమరిది రాజ్ పాకాల (Raj Pakala), స్నేహితుడు విజయ్ మద్దూరి (Vijay Madduri) సోమవారం పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్నటి నుంచి విజయ్ మద్దూరి (VIjay Madduri) ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంది. జన్వాడ ఫామ్ హౌస్ (Janwada Faram House)లో పార్టీ జరిగిన రోజు రెయిడ్స్ సందర్భంగా తన ఫోన్ బదులుగా వేరే మహిళ ఫోన్‌ను విజయ్ పోలీసులకు ఇచ్చాడు. దీంతో తన ఫోన్ తనకు ఇవ్వాలంటూ సోమవారం సదరు మహిళ మోకిల పోలీసులను (Mokila Police) ఆశ్రయించింది. ఇవాళ ఆ మహిళ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్ట్ చేయనున్నారు.
కాగా, పార్టీలో పాల్గొన్న విజయ్ మద్దూరి (Vijay Madduri)కి వైద్య పరీక్షలు నిర్వహించగా.. కొకైన్ డ్రగ్ (Cocaine Drug) తీసుకున్నట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆయనకు కొకైన్ (Cocaine) ఎక్కడి నుంచి వచ్చింది, ఇచ్చిన డ్రగ్ పెడ్లర్ ఎవరు అనే విషయాలపై విచారణను వేగవంతం చేశారు. విజయ్ మద్దూరి ఫోన్‌లో ఉన్న సమాచారం తెలిస్తే.. పోలీసుల దర్యాప్తు మరింత సులువు కానుంది.