సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జగ్గారెడ్డి ఓపెన్ ఆఫర్

అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలని చూస్తోంది. 14 సీట్లలో గెలుపు లక్ష్యంగా

Update: 2024-04-26 11:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలని చూస్తోంది. 14 సీట్లలో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న అధికార పార్టీ లోక్ సభ ఎన్నికల వేళ చేరికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో చేరికల కమిటీని సైతం ఏర్పాటు చేసింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కోదండరామిరెడ్డిలు చేరికల వ్యవహారాన్ని పర్యవేక్షించనున్నారు. ఈ క్రమంలో చేరికల కమిటీ సభ్యుడు జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఘర్ వాపసీ మొదలు పెట్టామని స్పష్టం చేశారు.

నాకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చని అన్నారు. సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ చేరుతానంటే.. చేర్చుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మైనార్టీ రిజర్వేషన్లు తీసేస్తామని అంటున్నారని మండిపడ్డారు. దేశంలో బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన రాజకీయాలు చేస్తోన్న బీజేపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. 


Similar News