తెలంగాణలో 16 పార్లమెంట్ స్థానాలు గెలుస్తాం.. జగదీష్ రెడ్డి ధీమా

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జగదీష్ రెడ్డి రైతుదీక్ష చేపట్టారు.

Update: 2024-04-06 06:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జగదీష్ రెడ్డి రైతుదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టో పేరుతో కాంగ్రెస్ పార్టీ మరో మోసానికి దిగిందని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. ఎన్నికల లబ్ధిపొందడమే లక్ష్యంగా ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇస్తోందని ప్రజలు అర్ధం అయిందని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు అని కీలక వ్యాఖ్యలు చేశారు.

జీవితంలో కోమటిరెడ్డికి సోదరులకు నిజం చెప్పే అలవాటు లేదని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుస్తామని.. బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. నాగార్జున సాగర్ జలాశయంలో నీరు ఉన్నా, వాటిని వదలకుండా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. కాళేశ్వరంపై చెడు ప్రచారం చేసి, విధి లేని పరిస్థితుల్లో నిన్న మొన్న మోటార్లను ఆన్ చేసి హడావుడిగా నీళ్లు వదిలారని, అప్పటికే పొలాలన్నీ నిలువైన ఎండిపోవడంతో లాభం లేకుండా పోయిందన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..