TG: స్పీకర్ సంచలన నిర్ణయం.. అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెండ్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు.

Update: 2025-03-13 10:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy)పై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం జరిగే బడ్జెట్ సమావేశాలు(TG Budget Meetings) ముగిసే వరకూ ఆయనపై వేటు కొనసాగనుంది.

కాగా, అంతకుముందు మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మాట్లాడుతూ.. ‘స‌భ‌లో ఎమ్మెల్యే జ‌గ‌దీష్ రెడ్డి వ్య‌వ‌హ‌రించిన తీరు చాలా బాధాక‌రం. ఏక‌వ‌చ‌నంతో స్పీక‌ర్ను ఉద్దేశించి మాట్లాడ‌టం స‌రికాదు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏ స‌భ్యుడు కూడా బ‌యట లేదా లోప‌ల స్పీక‌ర్ పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌దు. స్పీక‌ర్ చ‌ర్య‌లు, అధికారాలను ప్ర‌శ్నించే అధికారం ఏ స‌భ్యుడికి లేదు. స‌భను నడవనీయొద్దనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్(BRS) స‌భ్యులు స‌భ‌కు వ‌చ్చిన‌ట్లుగా అనిపిస్తుంది. స‌భ గౌర‌వాన్ని కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది. స‌భ్యులంద‌రి కోరిక మేర‌కు జ‌గ‌దీష్ రెడ్డిని ఈ సెష‌న్ ముగిసే వ‌ర‌కు స‌స్పెండ్ చేయాల‌ని ప్ర‌తిపాదిస్తున్నా’ అని శ్రీధర్ బాబు మాట్లాడారు.

మరోవైపు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అనంతరం సభలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు.

Tags:    

Similar News