ప్రవళికది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. : RS ప్రవీణ్ కుమార్ (వీడియో)

తెలంగాణలో పోటీ పరీక్షల్లో వరుస లీకులు, వరుస వాయిదాలతో విరక్తి చెంది హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రవళ్లిక అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

Update: 2023-10-14 06:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పోటీ పరీక్షల్లో వరుస లీకులు, వరుస వాయిదాలతో విరక్తి చెంది హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రవళ్లిక అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆమెది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే ఆరోపించారు. దీనికంతటికి కేసీఆర్ ప్రభుత్వం, టీఎస్పీఎస్పీలే కారణమని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. గత మార్చి నెలలోనే బోర్డును రద్దు చేసి, కొత్త బోర్డును నియమించి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదన్నారు. కానీ కేసీఆర్-కేటీఆర్‌లు మొండిగా బోర్డును కాపాడారని విమర్శించారు. కనీసం ఇప్పుడైనా తెలంగాణ గవర్నర్ తన ప్రత్యేక అధికారాలను వినియోగించి వెంటనే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు నిరుద్యోగులు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని, బహుజన రాజ్యం త్వరలోనే రాబోతున్నదని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News