బిగ్ బ్రేకింగ్.. హైదరాబాద్ లో ఐటీ సోదాలు

హైదరాబాద్ లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. గూగి ప్రాపర్టీస్, అన్విత బిల్డర్స్ అధినేత అచ్యుతరావు ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు.

Update: 2024-10-17 02:32 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో ఐటీ అధికారులు గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. కొల్లూరు, రాయదుర్గంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. రాయదుర్గంలోని గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్, అన్విత బిల్డర్స్ అధినేత అచ్యుత్ రావు ఇంట్లో, బొప్పన శ్రీనివాస్, బొప్పన అనూప్ ఇళ్లలో సోదాలు చేపట్టారు. అలాగే ఆయన కంపెనీలో పనిచేసే కీలక ఉద్యోగులు, సన్నిహితుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. కొల్లూరు ప్రాజెక్ట్ ఆఫీసులో, రాయదుర్గంలోని అచ్యుతరావు నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని 30 ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ ఐటీ దాడులపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 


Similar News