మొసళ్ల రవాణ లారీ బోల్తా..రోడ్డుపైన పడిన మొసళ్లు

మొసళ్ల లోడ్ తో వెలుతున్న లారీ ఫల్టీ కొట్టడంతో నీళ్ళలో ఉండే మొసళ్లు కాస్తా రోడ్డున పడ్డాయి.

Update: 2024-10-17 04:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : మొసళ్ల లోడ్ తో వెలుతున్న లారీ ఫల్టీ కొట్టడంతో నీళ్ళలో ఉండే మొసళ్లు కాస్తా రోడ్డున పడ్డాయి.నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్ట సమీపంలో 44 జాతీయ రహదారిపై మొసళ్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో లారీలోని మొసళ్లలో రెండు బయట రోడ్డుపైన పడిపోయాయి. బీహార్ జిల్లా పాట్నాలోని సంజయ్ గాంధీ బయోలాజికల్ పార్కు నుంచి బెంగుళూరులోని బానర్ గట్స్ బయోలాజికల్ పార్కుకు ఎనిమిది మొసళ్లను లారీలో తరలిస్తున్నారు. మార్గమధ్యలో లారీ అదుపు తప్పి బోల్తా కొట్టడంతో మొసళ్లు లారీ నుంచి బయట పడిపోయాయి.

ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని మొసళ్ల సంరక్షణ చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు వెల్లడించారు. 


Similar News