కల్తీపాల మాఫియా గుట్టు రట్టు
హైదరాబాద్ పీర్జాదిగూడలో గుట్టుగా సాగుతున్న కల్తీ పాల దందాను ఎస్వోటీ పోలీసులు బట్టబయటు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పీర్జాదిగూడలో గుట్టుగా సాగుతున్న కల్తీ పాల దందాను ఎస్వోటీ పోలీసులు బట్టబయటు చేశారు. ఓ గ్యాంగ్‌గా ఏర్పడి రోజూ వేల లీటర్లు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ మాఫియా అరాచకాలను ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్తీపాల గ్యాంగ్ గురించి సమాచారం అందడంతో ఎస్వోటీ పోలీసులు పక్కా సమాచారంతో పీర్జాదిగూడలో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో గజేందర్ సింగ్ అనే వ్యక్తి తన గ్యాంగ్‌తో కలిసి ఓ గోడౌన్‌లో గుట్టుగా కల్తీపాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పాలపొడిలో ఎసిటిక్ యాసిడ్, లిక్విడ్ గ్లూకోజ్, పామాయిల్ కలిపి కల్తీపాలు తయారు చేస్తూ.. ప్రతి రోజూ 5 వేల లీటర్లకు పైగా పాలను ఎగుమతి చేస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే గజేందర్ సింగ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు.. గోడౌన్‌ను సీజ్ చేసి అందులోఉన్న టన్నుల కొద్దీ పామాయిల్, మిల్క్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు.