ఎదురు దెబ్బలు తగలడం సహజం!.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

ఎదురుదెబ్బలు తగలడం సహజం అని మళ్లీ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.

Update: 2024-06-02 08:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎదురుదెబ్బలు తగలడం సహజం అని మళ్లీ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ అవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న ఆయన అమరవీరులకు నివాళులు ఆర్పించారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆనాడు ప్రజల్లో విశ్వాసం నెలకొల్పెందుకు రోడ్లు ఎక్కామని, ఆ సమయంలో ఉద్యంమం జరగకుండా రాజకీయ నిరుద్యోగి అని పైసల కోసం ఉద్యమం చేస్తున్నారని నాపై రెండు ఆరోపణలు వేశారని, అందుకే తెలంగాణ ఉద్యమానికి ముందే నేను పదవులు త్యాగం చేశానని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ఆఫీస్ కోసం కొండా లక్ష్యణ్ బాపూజీ ఇళ్లు ఇస్తే.. కుట్రలు చేసి అది కూలగొట్టారని, ఆ రోజు ఆఫీస్ సమాన్ రోడ్డు మీదికి వేస్తే.. ఇంత ఎత్తైనా తెలంగాణ భవనం కట్టుకున్నామని అన్నారు.

ఉద్యమ సమయంలో ఎన్నో సార్లు రాజీనామాలు చేసినం.. జయాపజాయాలు వచ్చినయ్ అన్నింటిని దాటుకోని వచ్చామని తెలిపారు. ఇట్ల తెలంగాణ రాష్ట్రం వస్తది.. దశాబ్ది ఉత్సవాలు జరుపుతామని ఎవ్వరూ ఊహించలేదని, కనీసం కళ కూడా కనలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి 1999 లోనే పునాది పడిందని, అప్పటి నుండే పాటలు రాయడం, జెండాను రెడీ చేయడం ప్రారంభించామని, అసలు ఉద్యమ సమయం 13ఏళ్లు కాదని.. 15 ఏళ్లు పక్కా ఇది మీరందరూ తెలుసుకోవాలని అన్నారు. 1999 నుంచి 2014 ఉద్యమం చేశామని, 10 ఏళ్ల పాలనతో కలుపుకొని మొత్తం 25 ఏళ్ల ప్రస్థానం అని తెలిపారు. ఇంత చరిత్ర ఉన్న బీఆర్ఎస్ ను ఖతం చేస్తాం అని మొకాలు పొడుగు లేనోడు మాట్లాడుతున్నాడని, 25 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర ఉన్న ఇంత పెద్ద వ్యవస్థను ఖతం చేయడం వానితో అయితదా అని మండిపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, కొంత నైరాశ్యంతో ఎక్కడి వాళ్లు అక్కడే ఉన్నామని, మళ్లీ నేను బస్ ఎక్కితే ఉద్యమ పరిస్థితే వచ్చిందని అన్నారు. ఇలా వచ్చేటివి చిన్న విషయాలని.. ఎదురు దెబ్బలు తగలడం సహజం అని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో లేదు ఖతం అయ్యిందా లేదు కాదా.. అలాగే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ రావడం ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, ఇది 100 శాతం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, ఎన్నికల్లో అర్రాస్ పాట పాడినట్లు అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని అన్నారు. మేం పథకాలు ఇస్తే కాంగ్రెస్ వాళ్లు అసెంబ్లీలో హేళన చేశారని, కానీ ఇప్పడు తెలంగాణలో పాలన రివర్స్ అయ్యిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి రిప్లేస్ మెంట్ బీఆర్ఎస్ మాత్రమేనని, అది వేరే పార్టీకి సాధ్యం కాదని కేసీఆర్ తేల్చి చెప్పారు. 


Similar News