ఉద్యోగులకు ఐటీ కంపెనీ షాక్.. 600 మందిని..
ఐటీ, తదితర కంపెనీల్లో ఆర్థిక సంక్షోభం కారణంగా అందులో పనిచేసే ఉద్యోగులను సగానికి సగం మంది తొలగిస్తున్న సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో: ఐటీ, తదితర కంపెనీల్లో ఆర్థిక సంక్షోభం కారణంగా అందులో పనిచేసే ఉద్యోగులను సగానికి సగం మంది తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే ప్రముఖ వీడియో గేమ్ సాఫ్ట్వేర్ సంస్థ ‘యూనిటీ’ మరోసారి లేఆఫ్స్‌కు శ్రీకారం చేట్టుంది. వరల్డ్ వైడ్‌గా ఆ సంస్థలో పనిచేస్తున్న 8 శాతం.. సుమారు 600 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. అదే కంపెనీలో తొలి సారిగా గత ఏడాది జూన్‌లో 225 మంది సిబ్బందిని తొలగించారు.
ఈ ఏడాది 284 మందిని, తాజాగా 600 మందిని ఇంటికి పంపించేశారు. మెరుగైన ఫలితాలు సాధించేలా సంస్థలోని అన్ని విభాగాల్లో పునర్నిర్మాణం అవసరమని భావిస్తున్నామని, కాబట్టే వరుసగా మూడో దఫా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో జాన్ రిక్సిటిఎల్లో యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో వివరణ ఇచ్చారు. ప్రాచుర్యంలో ఉన్న సంస్థలోనే ఇలా తొలగిస్తూ ఉంటే చిన్న కంపెనీల పరిస్థితి ఏమిటని ఐటీ ఉద్యోగులు భయందోళనలో లేఆఫ్స్ భయం పట్టుకుంది.