కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం.. నాణత్యకు తిలోదకాలు!
ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించి కోట్లాది రూపాయలను మంజూరు చేస్తుంది.
దిశ, నేరేడుచర్ల : ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైనేజీలకు సంబంధించి కోట్లాది రూపాయలను మంజూరు చేస్తుంది. అయితే ఈ పనులను కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై నాసిరక పనులను చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సీసీ రోడ్లు వేసిన కొంత కాలనికే కంకర తేలి గుంటలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణంగా ఇసుక లేకుండా డస్ట్ పౌడర్ వాడటం, రోబో శాండ్ వాడి దానికి తగ్గటుగా సిమెంట్ వాడకపోవడమే.
రోడ్లు వేసే సమయంలో పంచాయతీ రాజ్ డిపార్ట్‌మెంట్ అధికారులు పరిశీలించాలి. కానీ ఆ సమయంలో అధికారులు అక్కడ లేకపోవడంతో దానిని అదునుగా చేసుకుని రోడ్లు కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారని దిశ పరిశీలనలో తెలుస్తోంది. సీసీ రోడ్లు వేసే ముందు రోడ్డుకు రెండు వైపుల సీసీ మిక్సింగ్ బయటకు వెళ్ళకుండా చానల్స్ వాడతారు. వాటిని నేలపై హెచ్చు తగ్గులు లేకుండా సరిచేసి పాలిథిన్ కవర్ వేసి సరిచేయాలి. కానీ సీసీ రోడ్డును ఎక్కువ మందంగా చూపించేందుకు ఆ చానల్ల వద్ద గుంతలను తీసి రోడ్లను పోస్తారు.
అలా చేయడం వలన కాంట్రాక్టర్లు పోసే సీసీ మెటిరియల్ తక్కువ పడుతుంది. చూసే వారికి రోడ్డు మందంగా కనిపిస్తుంది. చేయని పనికి కూడా బిల్లు తీసుకుంటారని సమాచారం. కొందరు కాంట్రాక్టర్ చేసే పనులలో ఏ మాత్రం నాణ్యత ఉండటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సీసీ, డ్రైనేజీ పనులలో ఇసుక లేకుండానే డస్ట్ పౌడర్ లేదా రోబో శాండ్ వాడుతున్నరని తెలిసింది. కంకరకు తగ్గట్టుగా సిమెంట్ వాడటం లేదు.
సీసీ రోడ్ల కింద పాలిథిన్ కవర్ లేకుండానే పనులు చేస్తున్నారని వేసిన రోడ్లు కొంత కాలానికే వాహనాలు తరచూ తిరగడం వలన కంకర తేలి గుంతల మాయంగా మారుతున్నాయి. ఇంత జరుగుతున్న పంచాయతీ రాజ్ శాఖ అధికారులు అక్కడ ఉండి ఏ విధంగా కంకర సిమెంట్ ఇసుక కలుపుతున్నారు. చూసుకొనే బాధ్యత వారికి లేదా..!? వారు ఎందుకు పరిశీలించడం లేదు. క్వాలిటీగా పనులు చేస్తే అధికారులకు రావాలసిన కమీషన్లు రాదనే భయంతోనే అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
అధికారుల పర్యవేక్షణ కరువు..
గతంలో పంచాయతీ రాజ్ ,ఆర్‌అండ్‌బి అధికారులు అందరూ ఆ మండాలాల పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉండేవారు. ప్రతిరోజు ఆఫీస్‌కు వచ్చి వారి పరిధిలో జరిగే పనులను పరిశీలించేందుకు ఆ ఆఫీస్‌లోని రిజిస్టర్‌లో ఎక్కడికి వెళ్తునారో రాసి అక్కడ ఉన్న ఎంపీపీకి చెప్పి వెళ్ళే వారు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు.
పంచాయతీ రాజ్ డీఈ ఆఫీస్‌లో ఉండటంతో వారు ఆఫీస్‌కు వెళ్తున్నారా...! ఇంటి వద్దనే ఉంటున్నారా..!? ఫీల్డ్ మీదకు వెళ్తున్నారా..!? అనేది తెలియని పరిస్థితి . ఎవరైనా ఫోన్ చేస్తే పై అధికారులకు ఫీల్డ్ మీదకు వేళ్తున్నాము అని చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో కనిపించడం లేని కొందరు ప్రజాప్రతినిదులు దిశ దృష్టికి తీసుకురాగా.. అధికారుల పనితీరుపై స్పెషల్ ఫోకస్ చేయగా ఇది వాస్తవం అని తెలుస్తోంది.
సొంతగా వేసిన చోటే క్వాలిటీగా
ప్రజా ప్రతినిధులు తమ గ్రామాలకు ప్రభుత్వం ద్వారా మంజురైన ఎస్‌డిఎఫ్, ఎన్ఆర్ఈజిఎస్, 15 ఫైనాన్స్ ద్వారా వచ్చే నిధులతో మంజురైన నిధులతో గ్రామలాలో సీసీ, మట్టి రోడ్లు ప్రభుత్వ భవనాలు అలాగే డ్రైనేజీ పనులను కొందరు ఆ గ్రామంలోని ప్రజా ప్రతినిధులే పనులు చేస్తున్నారు. వారు మాత్రం క్యాలిటీలో రాజీపడకుండా చేస్తున్నారు. క్వాలీటీ లేని పనులు చేస్తే కొంత కాలానికే అవి దెబ్బ తింటాయని ప్రజలతో మాట పడాల్సి వస్తుందని భయంతో క్వాలిటీగా పోస్తున్నట్లు తెలుస్తోంది.
కమీషన్లు ఇస్తేనే బిల్లులు ..
ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు చేసిన పనులను అధికారులకు కమీషన్ల ఇస్తేనే బిల్లులు చేస్తారని క్రింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారులకు చేసిన పనులలో పర్సంటేజీ చోప్పున కమీషన్లు ఇవ్వనిది ..పనులు చేయరని పనుల కోసం ఎన్ని సార్లు తిరిగిన మోహమాటం లేకుండా మా కమీషన్ మాకు ఇవ్వాల్సిందే. ఇసైనే పని చేస్తామని అంటున్నారని ఒక కాంట్రాక్టర్ వద్ద పనిచేసే వ్యక్తి దిశ కు వివరించారు .
అధికారికే 10 శాతం పర్సంటేజీ
ఎవరు పని చేసిన బిల్లులు పెట్టుకున్న అధికారులందరికీ కలిపి 10 శాతం పర్సంటేజీ ఇవ్వవలసిందే. ఆ కమీషన్లు ఇవ్వకుంటే బిల్లులు చేయరని తరచు తిప్పించుకుంటారని చేసేందేమి లేక బిల్లులు ఇవ్వాలిస్సిందేనని ఓ కాంట్రాక్టర్ వద్ద పనిచేసే వ్యక్తి దిశకు వివరించారు. అందులో పంచాయతీ ఏఈకి 4, డీఈ 2 అలాగే పంచాయతీ ఈఈ ఆఫీసులో ఈఈ కి 1శాతం ఆయన క్రింద డిఈకి 1శాతం సూపరింటెండెంట్‌కు 1/2 శాతం మిగతా సిబ్బంది 1/2 శాతం ఇసైనే బిల్లులు చేస్తున్నారని మరి క్యాలిటీగా పోస్తే కాంట్రాక్టర్లకు నష్టం వస్తుందని వివరించారు .