నమ్మితే నట్టేట ముంచిండు! ఐఏఎస్ అధికారి ఆకస్మిక బదిలీకి కారణమదేనా?
వరంగల్జిల్లా మాజీ కలెక్టర్ గోపి ఆకస్మిక బదిలీ వెనక ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.
వరంగల్జిల్లా మాజీ కలెక్టర్ గోపి ఆకస్మిక బదిలీ వెనక ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లతో పాటు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి కారణమని తెలుస్తున్నది. కలెక్టర్ ఎదుట వినయ విధేయతలు ప్రదర్శించిన ఓ అధికారిని సన్నిహితంగా మారినట్లు సమాచారం. దీంతో ఆ అధికారికి కలెక్టర్ గోపి కీలక బాధ్యలు అప్పగించినట్లు తెలిసింది. కలెక్టర్ గోపికి షోడోగా మారాడనే ప్రచారం సాగింది. ఇంత వరకు బాగానే ఉన్నా జిల్లాలోని ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేల ఫైళ్లను కలెక్టర్ గోపి క్లియర్చేయక పోవడంతోనే బదిలీకి ప్రధాన కారణంగా తెలుస్తుంది.
ముఖ్యమైన ఫైళ్ల బాధ్యతలను సదరు అధికారికి అప్పగించగా పెండింగ్‌లో పెట్టాడు. అంతేకాకుండా సదరు ఫైళ్లు కలెక్టరే పెండింగ్‌లో పెట్టారని ఆయా నేతల ముఖ్య అనుచరులకు చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారాలే కలెక్టర్ గోపి బదిలీకి కారణమయ్యాయి. నూతంగా వరంగల్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రావీణ్య క్యాంపు కార్యాలయంలో ఉద్యోగుల విషయంలో ఆచితూచి బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమ్మితే నట్టేట ముంచే వారితో జాగ్రత్త పడాలని కలెక్టరేట్అధికారులే పేర్కొంటున్నారు.
–దిశ, వరంగల్ బ్యూరో
వరంగల్ జిల్లా మాజీ కలెక్టర్, ఐఏఎస్ అధికారి డాక్టర్ గోపి ఆకస్మిక బదిలీ వెనుక ఆసక్తికర పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. బదిలీకి రాజకీయ ఒత్తిళ్లే కారణమని తెలుస్తున్నా, ఆ రాజకీయ ఒత్తిళ్లు వచ్చేందుకు క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కీలక అధికారి నిర్వాకమేనని తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా దిశకు అందిన సమాచారం ప్రకారం.. వరంగల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కీలక హోదాలో కొనసాగుతున్న ఓ అధికారి కలెక్టర్ గోపి ఎదుట వినయ విధేయతలను మెండుగా ప్రదర్శించి సార్‌కు చాలా దగ్గరైనట్లు సమాచారం.
దీంతో పూర్తిగా అధికారికి కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటు ఆయన సలహాలు, సూచనలు ఐఏఎస్ అధికారి పాటించేలా ఆకట్టుకున్నట్లుగా అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కలెక్టర్ గోపికి షాడో కలెక్టర్‌గా తయ్యారయ్యాడన్న చర్చ కొద్దిరోజుల క్రితం కూడా జరిగింది. అయితే ఈ విషయం వట్టి ప్రచారంగానే భావించి వదిలేసిన ఐఏఎస్ ఆఫీసర్ చివరికి ఆకస్మికంగా బదిలీ కావాల్సి వచ్చిందని కలెక్టర్ కార్యాలయ వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం.
మంత్రి, ఎమ్మెల్యేల ఫైళ్లు పక్కకు!
ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేయకపోవడమే కలెక్టర్ గోపి బదిలీకి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే ముఖ్యమైన ఫైళ్లను క్లియర్ చేయించే బాధ్యత, పర్యవేక్షణను క్యాంపు కార్యాలయంలో కీలకంగా పనిచేస్తున్న అధికారికి కలెక్టర్ గోపి అప్పగించినట్లు సమాచారం. ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో మంత్రి, ఎమ్మెల్యేల అనుచరులకు సదరు అధికారి చుక్కలు చూపెట్టినట్లుగా తెలుస్తోంది.
దీంతో కలెక్టర్ ఆదేశాలతోనే ఫైల్స్ క్లియరెన్స్ కావడం లేదన్న తప్పుడు అభిప్రాయాన్ని సదరు నేతలు అటు మంత్రికి, ఇటు ఇద్దరు ఎమ్మెల్యేల వద్దకు మోసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో ఓ మంత్రి సీఎస్‌కు ఫిర్యాదు చేయడంతో, ఫైల్స్ పెండింగ్ విషయం నిర్ధారించుకున్నాకే గోపిపై వేటు పడినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఇందులో ఐఏఎస్ అధికారి కావాలని చేసింది ఏమీ లేకున్నా సదరు కీలక అధికారి మాత్రం ఫైల్స్‌ను తొక్కిపెట్టి ఆయన బదిలీకి కారణమయ్యారన్న చర్చ అధికారుల్లో జరుగుతోంది.
ప్రావీణ్య అయినా జాగ్రత్త పడుతుందా..!
ఐఏఎస్ అధికారి గోపి ఆకస్మిక బదిలీ తర్వాత వరంగల్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రావీణ్య, ప్రస్తుతానికి జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గానూ కొనసాగుతున్నారు. వరంగల్ జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా పని చేసిన అవగాహన, పాలన అనుభవంతో వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల నియోజకవర్గాల సమ్మిళితంగా ఉన్న వరంగల్ జిల్లాను ముందుకు నడపనున్నారు. రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని సమర్థ పాలన సాగించగలరన్న నమ్మకంతోనే ప్రభుత్వం ఆమెకు బాధ్యతలు అప్పగించి ఉండవచ్చు.
అయితే వరంగల్ కలెక్టరేట్ నిర్మాణంతో పాటు పలు కీలక అభివృద్ధి పనులు జిల్లాలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారుల సహకారం ఎంతో ముఖ్యమైంది. అధికారుల ముసుగులోనే ప్రజాప్రతినిధుల కోవర్టులున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వినయ విధేయతలను ప్రదర్శిస్తూ, సీన్సియార్టీకి నిలువుటద్దంగా చెప్పుకునే కొంతమంది అధికారులతో కలెక్టర్ జాగ్రత్తగా ఉంటే మంచిదని కీలక హోదాల్లో పనిచేస్తున్న పలువురు అధికారులు పేర్కొంటుండటం గమనార్హం.