గురుకుల ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు: వాసుదేవరెడ్డి

గురుకుల ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు.

Update: 2024-07-01 15:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గురుకుల ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయని దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు. గురుకుల స్పెషల్ కేటగిరీ లో గందరగోళం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9,210 పోస్టులతో గురుకులాల నోటిఫికేషన్ వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రిజల్ట్స్ ఇచ్చి నియామకాల పేరుతో హడావిడి చేసిందని మండిపడ్డారు. వికలాంగుల కోటా కింద కొంతమందిని అపాయింట్మెంట్ చేశారని, జాయిన్ అవ్వడానికి వెళ్తే రిజెక్ట్ చేశామని అధికారులు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పెషల్ కేటగిరి, డిసేబుల్డ్ కేటగిరి కింద జాబ్ ఇచ్చే వారికి ముందుగానే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేశారు. కానీ, రేవంత్ రెడ్డి హడావిడిగా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఇప్పుడు ఉద్యోగం లేదంటే భాద్యులు ఎవరు? అని నిలదీశారు.

గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను తాము ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా ఇవ్వలేదని పేర్కొన్నారు. వికలాంగుల కోటాలో రిజెక్ట్ చేసిన ఉద్యోగాలను వెంటనే వారికి పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే స్పెషల్ కేటగిరి అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తారన్నారు. మెగా డీఎస్సీలో 25 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 11 వేలకు నోటిఫికేషన్లు ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఏమైంది? అని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి చక్కర్లు కొడుతున్నారు.. పాలనను విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల పాటు సీఎం, ఏడుగురు మంత్రులు ఢిల్లీలో ఉండటంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆరోపించారు. గాంధీ హాస్పిటల్ లో నిరుద్యోగులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని, వెంటనే స్పందించి వారి సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News